చింతమనేని ప్రభాకర్ కు 14 రోజుల రిమాండ్

  • ధర్నాకు వెళ్తుండగా చింతమనేని అరెస్ట్
  • లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారని కేసు
  • చింతమనేనితో పాటు 8 మంది అనుచరులకు రిమాండ్
తెలుగుదేశం పార్టీ దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు మేజిస్ట్రేట్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కరోనా లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారంటూ చింతమనేనిపై పోలీసులు 143, 149, 188, 269, 270, 341, 353 ఐపీసీ, 51 (ఏ) డీఎంఏ-2005 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో చింతమనేనితో పాటు మరో ఎనిమిది మంది అనుచరులను రిమాండ్ కు తరలించారు. అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసిన నేపథ్యంలో, ఏలూరు కలపర్రు టోల్ గేట్ వద్ద ధర్నా చేసేందుకు వెళ్తుండగా చింతమనేనిని పోలీసులు అదుపులోకి తీసుకుని, పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆ తర్వాత పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Chinthamaneni Prabhakar
Telugudesam
Remand

More Telugu News